ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోస్పాడులో ఎంఈవో కార్యాలయ భవనానికి భూమిపూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 03:58 PM

నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ భవన నిర్మాణానికి మంగళవారం భూమిపూజ జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ 7 సెంట్ల స్థలంలో రూ. 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులను ప్రారంభించారు. నూతన భవనం వల్ల విద్యా పరిపాలన మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa