ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఇండిగో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 'Sail Into 2026' పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద దేశీయ విమాన టిక్కెట్లు రూ.1,499 నుంచి, అంతర్జాతీయ టిక్కెట్లు రూ.4,499 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 13 నుంచి 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. టిక్కెట్లు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి చెల్లుతాయి. రెండేళ్ల లోపు పిల్లలకు దేశీయ టిక్కెట్లు కేవలం రూ.1కే లభిస్తాయి. అదనపు సౌకర్యాలపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa