ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం కీలక నిర్ణయం: బీమా కంపెనీల్లో 100% ఎఫ్డీఐ అనుమతి

national |  Suryaa Desk  | Published : Sat, May 02, 2026, 08:13 PM

FDI In Insurance: ఇన్సూరెన్స్ రంగంలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని తాజాగా అధికారికంగా నోటిఫై చేసింది.1938 బీమా చట్టం ప్రకారం, ఎఫ్‌డీఐ స్వీకరించే ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పనిసరిగా ఐఆర్డీఏఐ (IRDAI) లైసెన్స్ లేదా అనుమతి పొందాలి అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రత్యేక చట్టం కింద పనిచేస్తున్నందున, ఇందులో ఆటోమేటిక్ రూట్ ద్వారా విదేశీ పెట్టుబడులు 20 శాతం వరకు మాత్రమే అనుమతించబడతాయి. LICలో పెట్టుబడులు 1956 చట్టంలోని నిబంధనలకు లోబడి ఉండాలి.
*చట్ట సవరణలు : విదేశీ పెట్టుబడులు ఉన్న బీమా కంపెనీల్లో బోర్డు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓలలో కనీసం ఒకరు భారతీయ పౌరుడై ఉండటం తప్పనిసరి అని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని DPIIT ఇప్పటికే 100% ఎఫ్‌డీఐకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.డిసెంబర్ 2025లో పార్లమెంట్ ఆమోదించిన ‘సబ్కా బీమా సబ్కీ రక్ష’ (బీమా చట్టాల సవరణ) బిల్లు 2025 ద్వారా బీమా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
*సరిహద్దు దేశాల పెట్టుబడులు : 1938 బీమా చట్టం, 1956 LIC చట్టం, 1999 IRDAI చట్టాల్లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అలాగే, భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులపై నిబంధనలను కూడా సడలించింది. తాజా మార్పుల ప్రకారం, ఈ దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల్లో 10 శాతం వరకు సాధారణ పెట్టుబడుల కేటగిరీలోకి తీసుకువస్తారు.భారత్ సరిహద్దు దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐను నియంత్రించే విధానంలో కూడా కేంద్ర కేబినెట్ మార్పులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa