ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు బడి వ్యవసాయ ప్రదర్శనకు భారీ స్పందన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 05:30 PM

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో నిర్వహించిన ” వ్యవసాయ ప్రదర్శన ” కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వ్యవసాయ పెట్టుబ డులు తగ్గించి దిగుబడి పెంచుకు న్నప్పుడే రైతుకు వ్యవసాయం లాభ సాటి అవుతుందని తెలిపా రు. రైతుల సంక్షేమానికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థి తులలో రైతులకు ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించడమే కాకుండా రుణమాఫీ చేశామన్నా రు. మొదటి విడత ఆరు లక్షల మంది 0-1 లక్ష రూపాయలలోపు ఋణాలున్న రైతులకు 6000 కోట్ల రూపాయలు, రెండవ విడత 0 నుండి లక్షన్నర లోపు రుణాలు ఉన్న ఆరు లక్షల మంది రైతులకు 6000 కోట్లు, ఆగస్టు 15న 0 నుండి 2 లక్షల రూపాయల్లోపు రుణాలున్న రైతులకు 6,000 కోట్లు మొత్తం 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని వెల్లడించారు.
రేపటినుండి రెండున్నర లక్షల రూపాయల వరకు రుణాలు ఉండి 2 లక్షలకు మించి వున్న మొత్తాన్ని రైతులు బ్యాంకులకు వెంటనే చెల్లించినట్లయితే రెండు లక్షలను ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. అలాంటి ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 నుండి 12 వేలు ఉన్నట్లు తెలిపారు. రుణమాఫీ పథకాన్ని ప్రకటించే ముందు తాము రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులలో రైతులుకు ఉన్న రుణాల గురించి తెలుసుకున్నామని, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకులలో 42 లక్షల ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, 31 వేల కోట్ల రూపాయలు రైతులు అప్పులు ఉన్నారని తెలుసుకొని 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి రెండు లక్షల లోపు రుణాలు అందరికీ వారి వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, కొంతమంది రైతుల డాక్యుమెంట్లు సరిగస్ లేకపోవడం, సాంకేతిక కారణాల కారణంగా రైతు రుణమాఫీ ఆగిపోయిందని, ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నోడల్ అధికారుల ను ఏర్పాటుచేసి సాంకేతిక సమస్యలను అధిగమించిన వారికి వెంటనే రైతు రుణమాఫీ వారి ఖాతాలలో వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో రైతులను మోసం చేయదని ఆయన అన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాకే అత్యధికంగా 1433 కోట్ల రూపాయలను 1,72,785 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు.
నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ కి కేరాఫ్ గా ఉండిందని, ఇక్కడి ప్రజల బాధలను తొలగించేందుకు ఎస్ఎల్ బిసీని తీసుకురావడం జరిగిందని, అయితే ఎస్ ఎల్ బిసి పూర్తికి దీర్ఘకాలం పడుతుందని ఊహించి ఏఎంఆర్పిని తీసుకురావడం జరిగిందని మంత్రి తెలిపారు. దీంతోపాటు బ్రాహ్మణ వెల్లేముల వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు అవకాశం కలిగిందని అన్నారు .రైతులు లిఫ్ట్ ఇరిగేషన్లు, మోటార్ల కింద వరిని తగ్గించుకోవాలని, వాణిజ్య పంటలను వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ వంటి తోటలను సాగు చేస్తే ఎకరాకు లక్ష నుండి లక్షన్నర ఆదాయం వస్తుందని, ప్రజాప్రతినిధులు రైతులందరూ ఆయిల్ ఫామ్ ని ప్రోత్సహించి ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయాల్సిందిగా కోరారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని ఆయన అన్నారు .నల్గొండ జిల్లాలో ఇదివరకే పామాయిల్ తోటల పెంపకం చేపట్టారని, ఇందుకుగాను తక్షణమే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఆయన జిల్లా కలెక్టర్ తో కోరారు.
జిల్లాలో బత్తాయి ఎక్కువగా సాగవుతున్న దృష్ట్యా ఇతర దేశాలకు బత్తాయిని ఎగుమతి చేసేందుకు హైదరాబాదులోని ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఎక్స్పోర్ట్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు .రైతులు వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పురుగుమందులను తక్కువగా వాడాలని, యూరియాని తగ్గించి వాడాలని అన్నారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన నూతన మార్పులు, సాంకేతికతను చూసి సాఫ్ట్వెర్ ఇంజనీర్లు  సైతం వ్యవసాయ రంగానికి వస్తున్నారని, ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంటే వ్యవసాయ రంగంలో ఆదాయం ఎక్కువగా వస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ రైతు అందరికీ ఆరాధ్యుడిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని ,రైతు సౌభాగ్యమే తమ ధ్యేయమని అన్నారు.నూతన వరవడిని సృష్టించే విధంగా తెలంగాణ రైతాంగాన్ని తీర్చిదిద్దుతామని  తెలిపారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అలాంటి వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని రాబడి పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు వరినే కాకుండా పామాయిల్ వంటి వాణిజ్య పంటలను పండించాలని, ప్రతి సంవత్సరం దేశంలో 80 నుండి లక్ష కోట్ల రూపాయల విదేశీ మరకద్రవ్యాన్ని పామాయిల్ పై ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తయితే 4 లక్షలు ఎకరాలకు సాగునీరు వస్తుందని, ఇప్పటివరకు 34.8 కిలోమీటర్ల మేర పూర్తయిందని తక్కిన 9.5 కిలోమీటర్లను పూర్తి చేయాల్సిందని అన్నారు. గ్రావిటీ కెనాల్ ద్వారా శ్రీశైలం నుండి నేరుగా 848 అడుగుల నుండి నీతిని తీసుకోవచ్చని ఆయన తెలిపారు. బ్రాహ్మణవెళ్ళెంల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుందని, ఈ ప్రజక్టుకు 35 కోట్ల రూపాయలు కేటాయిస్తే భూసేకరణ సమస్య తొలగించవచ్చని చెప్పారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలలో ఎస్ఎల్ బిసీ సొరంగ మార్గాన్ని పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. ఇటీవల బ్రాహ్మణ వెళ్లెముల ట్రయల్ రన్ ప్రారంభించామని, ఏఎం ఆర్పి కాలువల లైనింగ్ ,ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువ ల పూర్తి చేయటం, అలాగే ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు . రైతుల సంక్షేమం లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద 31 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని ,ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రతినెల మొదటి తేదీననే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, తమ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా రైతులకు ఫామ్ పాండ్స్ నిర్మాణం, విత్తనాలను అందజేస్తున్నామని ,ఇంకా రైతులకు అవసరమయ్యే సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నదాతను ఎవరు మర్చిపోకూడదని, తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా పేరొందిందని చెప్పారు. పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి  మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, ఆర్గానిక్ వ్యవసాయం పై అవగాహన కోసం వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలో విరివిగా చేపట్టాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa