వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కెవిపిఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ 78ఏళ్ల తర్వాత కూడా ఆ స్వాతంత్ర్య ఫలాలు అట్టడుగు ప్రజలకు అందలేదని కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు పాలకవర్గాలు ఎర్రతివాచి పరిచి అట్టడుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని, స్వాతంత్ర ఫలాల సంరక్షణ కోసం దేశంలో ధర్మ యుద్ధం చేయటానికి యువతరం నడుంబిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జానవెస్లీ పిలుపునిచ్చారు.
సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో 78 ఏళ్ల స్వాతంత్రం రాజ్యాంగ ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై KVPS ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ జిల్లా సదస్సు KVPS జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య అధ్యక్షత జరిగింది.ప్రధాన వక్తగా పాల్గొన్న KVPS రాష్ట్ర అధ్యక్షులు జానవెస్లీ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ ఆకలి సూచికలో 111వ స్థానానికి చేరిందన్నారు .
40 కోట్ల నిరుద్యోగ సైన్యం పెరిగిందని,46కోట్ల మంది ప్రజలు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని చెప్పారు మరోవైపు 169 మంది శతకోటీశ్వరులు ఎదిగి ఆధాని ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడుగా అయ్యాడని చెప్పారు.40 శాతం మంది ప్రజల ఆస్తి ఒక శాతం చేతుల్లో మగ్గుతుందని ఈ ఆర్థిక అంతరాలు పెరుగుతున్న తీరు దేశాన్ని మరింత దిగజార్చే వైపు నడిపిస్తుందన్నారు సామాజికంగా కుల వివక్ష అంటరానితనం నేటికీ కొనసాగుతుందన్నారు దళితులపై దాడులు దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు మహిళలు మైనారిటీలపై 300 రెట్లు పెరిగాయన్నారు.
దళితుల హత్యల్లో బిజెపి పాలిత యూపీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మహిళలపై గ్యాంగ్ రేప్ లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.సామాజిక ఆర్థిక అంతరాలను తొలగించకపోతే దేశంలో మరో స్వాతంత్య్ర పోరాటానికి యువతరం నడుం బిగించాలన్నారు. మతోన్మాదుల చెర నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు రాజ్యాంగ మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం ఫెడరలిజం లౌకికతత్వం సామాజిక న్యాయాలను బిజెపి వాటి పునాదుల నుండి పెకిలిస్తుందన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించినప్పుడు మెజారిటీ మతోన్మాద అధిపత్యం ఎక్కడ ఉంటే అక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై మెజారిటీ మతోన్మాదులుగా ఉన్న ముస్లింలు దాడులు చేస్తున్నారని ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.కానీ భారతదేశంలోనే మణిపూర్ లో ఇద్దరు గిరిజన యువతులను నగ్నంగా ఊరేగింపు చేసినప్పుడు ఈ రోజు గొంతు చించుకుంటున్న మతోన్మాదులు ఆనాడు ఎందుకు నోరు విప్పలేదని విమర్శించారు.మతోన్మాదం ఏ దేశంలో ఉన్న ప్రమాదమేనని దాన్ని భారత రాజ్యాంగం అంగీకరించదన్నారు. మతసామరస్యం లౌకిక విలువల పరిరక్షణ కోసం భారతదేశ సమైక్యత సమగ్రతల కోసం యువతరం మతోన్మాదుల దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో KVPS జిల్లా ఉపాధ్యక్షులు R. మహిపాల్, నాయకులు సుదర్శన్, j.లాలు, నవీన్ D. నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa