ట్రెండింగ్
Epaper    English    தமிழ்

*మెడికల్ కళాశాల తెచ్చిన మాపై నిర్బందమా..? అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 03:54 PM

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గార్ల సహాకరంతో నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రజలు,బీఆర్ఎస్ పార్టీ కోరిక మేరకు వరంగల్ జిల్లాకు సంబందించిన జిల్లా స్థాయి ఆసుపత్రి నర్సంపేటకు కావాలని కోరటం జరిగింది..
ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం ముందు చూపుతో ఆనాడే జిల్లా ఆసుపత్రి తీసుకురావటం జరిగింది. ప్రభుత్వానికి స్థలాన్నిచ్చి 183 కోట్ల రూపాయల మంజూరీ తీసుకొచ్చి,టెండర్లు పిలిచి,భూ యజమానులతో సమన్వయం చేసుకుని,వారి కుటుంబాలకు ఉద్యోగ ఉపాది కల్పిస్తామని మాట ఇచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దూరదృష్టితో ఆలోచించాం కాబట్టే ఇంతటి విజయం సాదించాం..జిల్లా ఆసుపత్రి ఉంటే మెడికల్ కళాశాల వస్తుందనే ఆలోచనలు ఫలించాయి.
జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ గారి ఆలోచనతో వరంగల్ జిల్లాకు సంబందించిన మెడికల్ కళాశాల నర్సంపేటకు రావాలని,అందుకు ముందస్తు అన్ని రకాల వసతులతో కూడిన పీజి ,జిల్లా ఆసుపత్రి నిర్మితమై ఉంది కాబట్టి మెడికల్ కళాశాల ఇవ్వాలని ఆనాడు కోరటం జరిగింది.
నా కల నెరవేరింది.మెడికల్ కళాశాల మంజూరీ వచ్చింది.పూర్తి అయ్యింది..ప్రభుత్వాలు మారినా పాలన నిరంతరం అయింది.అన్ని రకాల అనుమతులతో కూడిన మెడికల్ కళాశాల ఈ రోజు ప్రారంభించడం నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు దక్కిన అరుదైన గౌరవంగా బీఆర్ఎస్ పార్టీ బావిస్తుంది..
కాంగ్రేస్ ప్రభుత్వాన్ని నడపడం రాక,వాళ్ళు చేసిందేమి లేక వాళ్ళ ఫేయిల్యూర్స్ ను ప్రజలు గ్రహిస్తున్నారనే ఉద్దేశ్యంతో అర్థరాత్రి అక్రమ అరెస్ట్ లకు తెరలేపింది..
నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిదులను,నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో బందించారు..కొందరిని పక్క నియోజకవర్గ పోలిస్ స్టేషన్లలో బందించారు..ఈ నిర్బందకాండ ను తీవ్రంగా ఖండిస్తున్నాం..
మెడికల్ కళాశాలకు కర్త,కర్మ,క్రియ నేను..నల్లబెల్లిలో నా ఇంట్లో ఉన్న నన్ను పోలీసులు గృహనిర్భందం చేయడం హేయనీయం..
జిల్లా ఆసుపత్రి రావటం ,మెడికల్ కళాశాల పూర్తవటం తాను దానికి ఆద్యుడనైనప్పటికి ప్రభుత్వం మారినా మెడికల్ కళాశాల కోసం ఉత్సవాలు జరిపాం,స్వాగతించాం..
ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపలేదు.మేమే పండుగ వాతావరణానికి పిలుపునిచ్చాక,శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మమ్మల్ని అక్రమంగా ఎందుకు నిర్బందించి అవమానిస్తున్నారో కాంగ్రేస్ మంత్రులు సమాదానం చెప్పాలి..?కాంగ్రేస్ కుట్రలకు తెరలేపిందనటానికి ఇది నిదర్శనం..
నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా లేఖ రాయటం జరిగింది.. మేం తెచ్చిన పథకాలు,నిదులు నిల్వ ఉండి వృదాగా పోతున్నాయి,మెడికల్ కళాశాలకు సంబందించి 100 కోట్ల నిదులు మాత్రమే ఖర్చు అయ్యాయి.ఇంకా 183 కోట్లు ఇతర పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉంది.50 సీట్లతో కూడిన మెడికల్ కళాశాలకు మాత్రమే మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది..భవిష్యత్ లో 150 సీట్లకు అనుమతి వస్తుంది..నర్సంపేటలో రోడ్లు రద్దవుతున్నయ్,అనేక రకమైన అభివృద్ది పనులు రద్దవుతున్నయ్.ఈ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గం అభివృద్దిపై దృష్టిపెట్టండి,సమీక్ష జరపండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాయటం జరిగింది..
రాజకీయాలకు సమయం కాదు నియోజకవర్గ అభివృద్ది ముఖ్యం అని ప్రకటించడం జరిగింది..
ఎవరూ ఏ పిలుపునివ్వలేదు,రాజకీయాల గురించి మాట్లాడలేదు.విమర్శ కూడా చేయలేదు..ఏ కారణం చేత అరెస్ట్ లు,నిర్బందాలు చేసారో వారు సమాదానం చెప్పాలి..
బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో వచ్చిన మెడికల్ కళాశాల,జిల్లా ఆసుపత్రి నిర్మాణం..దానికోసం గొప్ప సహాయం చేసిన వ్యాపారవెత్త దొడ్డా మోహన్ రావు గారు, త్యాగాలు చేసిన రైతుల కుటుంబాలను గౌరవించుకోవాల్సిన పండుగ ఈ రోజు,ఈ ప్రాంతంలో సేవలందించిన వైద్యులను సన్మానించుకునే సందర్బం ఇది..
రాష్ట్రంలోనే అన్ని రకాల విద్యాసంస్థలు ఉన్న ఏకైక నియోజకవర్గంగా నర్సంపేటను తీర్చిదిద్దాం..ఈ ప్రాంత విద్యకు సహకరించిన,మేదావులను సన్మానించుకోవాల్సిన సందర్బం ఇది..అవి మరచి మెడికల్ కళాశాల తెచ్చిన మా పార్టీ ప్రతినిదులను ఎందుకు అరెస్ట్ చేసారో మంత్రులు సమాదానం చెప్పాలి..!
5 ఏండ్లలో నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది.నిర్బంద రాజకీయాలు,కక్ష రాజకీయాలు మేమేనాడు చేయలేదు..మార్పులో బాగంగా నిర్బంధ పాలనకు తెరతీసింది కాంగ్రేస్ ప్రభుత్వం..ప్రజాపాలన పేరుతో జరుగుతున్న అక్రమ నిర్బందాలు,గాడితప్పిన పాలనపై ప్రజలు బుద్ది చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa