ఆదిలాబాద్ లోని డైట్ కళాశాలలో సైకాలజీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సింగు గంగామణి డాక్టరేట్ పట్టా పొందారు. తమిళనాడులోని చెన్నై టీచర్స్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయం నుంచి విద్య విభాగంలో డాక్టరేట్ సాధించగా, ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్. వి రవి చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన దర్జీ రాజన్న-అనసూయ దంపతుల కూతురైన గంగామణి భర్త రవికుమార్ ప్రోత్సాహంతో డాక్టరేట్ సాధించినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa