ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుభవరాహిత్యం వల్లే ప్రభుత్వ ఆదాయం పడిపోతోందన్న కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 07:12 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమంగా పడిపోతోందని, పరిపాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'తగ్గుతున్న సర్కార్ ఆమ్దానీ' పేరుతో 'వెలుగు' పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు. ప్రభుత్వ ఆదాయం పడిపోతోందని, అనుభవరాహిత్యంతోనే ఈ అనర్థమని పేర్కొన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచే తెలివి ఈ ముఖ్యమంత్రికి లేకపోవడమే సమస్య అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఈ దుస్థితి ఏర్పడితే రానున్న నాలుగేళ్లు మరింత కష్టమే అని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప దిద్దుబాటు చర్యలు కనుచూపు మేర కూడా కనిపించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం... మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్‌దే అంటూ తన ట్వీట్ ముగించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa