ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 05:22 PM

గచ్చిబౌలి డివిజన్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానందనగర్లోని ఆయన నివాసంలో  కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి  మాట్లాడుతూ.. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కి సహకరించాలని, డివిజన్లో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధికోసం మరిన్ని నిధులు,డివిజన్లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను  అదేవిధంగా మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని  కోరామన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలందర్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి,కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు శేఖర్ , ప్రసాద్,సుమన్,ప్రకాశ్,రాజు, మహేష్  పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa