ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండ సురేఖను మంత్రి పదవి నుంచి వెంటనే భర్తరాఫ్ చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 05:45 PM

షరతుగా కొండా సురేఖ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి దిగజారి మాట్లాడుతున్న కొండ సురేఖ. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆయన అనుచరులు కొండ సురేఖ లాంటి కొంతమంది మంత్రులు తెలంగాణ నుండి రియల్ ఎస్టేట్ రంగాన్ని సీని ఇండస్ట్రీ రంగాన్ని ఆంధ్రకు పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి  సురేఖకు చేతనైతే గత ఎన్నికలలో మోసపూరిత హామీలు ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్నా హామీలు గుర్తుకు రావడం లేదు ప్రస్తుతం తెలంగాణలో సంక్షేమ పథకాల మీద దృష్టి లేకుండా అభివృద్ధి మీద పట్టింపు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో పాటు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా ఆంధ్రకు పంపి తన గురువు చంద్రబాబుతో మెప్పు పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. రెండు లక్షల అరుణమాఫీ హైడ్రా బాధితుల గోడు నిరుద్యోగుల నిరసనలు బయటికి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల వరకు దిగజారి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ చేతగానితనమని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa