సమాజంలో మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను అందరూ ఖండించాలని సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి పల్లెపాడు దామోదర్ అన్నారు. గురువారం ఆత్మకూరు మండలం సమైక్య కార్యాలయంలో మహిళలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారణ పై అవగాహన సదస్సు లో మాట్లాడుతున్న పల్లెపాడు దామోదర్ మహిళలు, యువతులు ఐక్యంగా ఉద్యమిస్తేనే హత్యలు అత్యాచారాలు ఎదుర్కోగలుగుతామని ఆయన అన్నారు. ఎక్కడ బాలికల పైన గాని మహిళలపై గాని అత్యాచారాలు జరిగిన వెంటనే ఐక్యంగా బాధితురాలకు అండగా నిలిచి నిందితుడు కి కఠిన శిక్ష పడే విధంగా సంగటితంగా ఉద్యమించినప్పుడే అత్యాచార లాగుతాయన్నారు.
ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ నేర పరిశోధన విభాగం తెలియజేసిన వివరాల ప్రకారం గత ఐదు సంవత్సరాలలో మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగాయి అన్నారు. 13 నిమిషాలకు ఒక మహిళ వరకట్నపు హత్యలకు గురవుతున్నారని, అలాగే అత్యాచారాలకు కూడా గురవుతున్నారని నిందితులను కఠినంగా శిక్షించినట్లయితే అత్యాచారాలు పునరావృతం కావని ఆయన అన్నారు. ఐకమత్యంతోనే సాధ్యమవుతుందని మహిళలు ఎక్కడ సంఘటన జరిగిన ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే తప్పు చేయాలంటే భయపడే విధంగా ప్రతి చర్యలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం లలితాదేవి, సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కవి రాజ్, సమైక్య కార్యదర్శి అరుణ, కోఆర్డినేటర్లు శాంసంగ్, రజని, సర్వోదయ ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa