ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 06:26 PM

నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి పథకం   ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అనారోగ్యంతో బాధపడినప్పుడు కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  మండల పరిధిలోని ఉప్పరపల్లి  గ్రామానికి చెందిన చిదుగు పోచమ్మకు రూ.12 వేల సీఎం సహాయనిది చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యానికి గురైై ప్రాణాలను పోగొట్టుకోవద్దన్న సంకల్పంతోనే  ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆదుకోవడం కోసం సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా సరే అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రహీముద్దీన్, నాయకులు అల్లిశేఖర్ రెడ్డి,రాజలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa