వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసి ప్రజావాణి హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రజావాణి ఫిర్యాదులతో ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి కార్యాలయ ప్రజావాణి ఫిర్యాదులు వస్తున్నాయని వాటన్నింటినీ సకాలంలో పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలోని చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించి రావాలని అధికారులను సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa