జగిత్యాల పొన్నాల గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 170 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 47 లక్షల రూపాయల విలువగల చెక్కులు 12 మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదిముభారాక్ ద్వారా మంజూరైన 12 లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ సేవలు అభివృద్ది పనులు సంస్కరణలు అందరికీ ఆదర్శం అన్నారు. కాంగ్రెస్ హయంలో అంతర్గాంలో దళిత ప్రజల కోసం 8 ఎకరాల భూమినీ ఇళ్ళ స్థలాల కోసం ఇవ్వడం జరిగిందనీ అన్నారు. త్వరలోనే 40 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం అని అన్నారు. 9 కోట్ల పనులకు టెండర్ లు పూర్తి అయ్యాయనీ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక పల్లెబస్తీ దవాఖానలు జగిత్యాలకు మంజూరు అయ్యాయనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.