సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న బస్టాండ్ ఆవరణంలో మరుగుదొడ్ల ట్యాంక్ నిండి నీరు ఖాళీ ప్రదేశంలో చెరి భయంకరమైన దుర్వాసన వెదజల్లుతుందని 26వ వార్డు ప్రజలు పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ స్పందించకపోకపోవడంతో ఆగ్రహ వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... కొన్ని సంవత్సరాల నుండి కోదాడ బస్టాండ్ ఆవరణంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మురుగుదొడ్ల ట్యాంక్ నిండి బయట ఖాళీ ప్రదేశంలో నిరు నిల్వ ఉండడం తో భయంకరమైన దుర్వాసన వెదజల్లుతుందని.
పలుమార్లు డిపో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించకపోకపోవడంతో పలు రోగాల బారిన పడిన పట్టించుకునే నాధుడే లేడని వాపొయ్యారు. మురుగు నీళ్లలో దోమలు,ఈగలు, చేరి విష జ్వరాలు వస్తున్నాయని అధికారులపై కాలనీవాసులు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని షేక్ రషీద్, జమీర్, సర్దార్, కోరారు..