గీతా జయంతి సందర్భంగా పెద్దపెల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో భగవత్గీత శ్లోకాల పఠణo జరిగింది.ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ మణి మాట్లాడుతూ భగవద్గీత మానవ జీవితానికి ఒక మార్గదర్శక గ్రంథం మాత్రమే కాకుండా, శాస్త్రతను అర్థం చేసుకోవడానికి కూడా ఒక మూలస్ధంభంగా నిలుస్తుందన్నారు.
భగవద్గీతలోని ఆధ్యాత్మికత మరియు నైతికత మనకు ఆధునిక శాస్త్రానికి అన్వయించడానికి అనేక సందర్భాలు ఉన్నాయి అని అన్నారు.ఈ సందర్బంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన తెలుగు ఉపాధ్యాయులు మామిడిపల్లి కరుణాకర్ ,ముస్కె స్వప్న లకు ప్రత్యక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో విద్యార్థులతో పాటు పాఠశాల కరెస్పాండంట్ ఆర్వి రమణారావు,ప్రిన్సిపాల్ సుధాకర్ అధ్యాపకులు, విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.