జగిత్యాల జిల్లా బీట్ బజార్ ప్రాంతానికి చెందిన పల్లె యశ్వంత్ కుమార్(30) తన స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా జగిత్యాల - కోరుట్ల ప్రధాన రహదారిపై కారు ఢీ కొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై మన్మథరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa