సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంలా మారిందని దుబ్బాక నియోజకవర్గ మన్ కీ బాత్ కన్వీనర్ ముత్యాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో అందే బాలగౌడ్ కు రూ. 37,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవచ్చన్నారు.
పేదల పక్షాన పోరాడే ప్రజా నాయకుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని, ఆయన సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట శక్తి కేంద్ర ఇన్చార్జ్ రంజిత్ గౌడ్, భూత్ అధ్యక్షులు భాను, శ్రీకాంత్, బిజెపి నాయకులు ప్రవీణ్, స్వామి, యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa