ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ హైకోర్టు కేటీఆర్‌కు ఇచ్చిన బిగ్ షాక్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 02:14 PM

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్‌ ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతించాలని ధర్మాసనాన్ని ఆయన తరుపున న్యాయ వాది గండ్ర మోహన్ రావు కోరారు. అయితే కేటీఆర్‌ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. అసెంబ్లీలో ఏం జరిగింది.. చెప్పు చూపించింది ఎవరు మధ్యాహ్నం మరోసారి... కాగా.. ఫార్ములా ఈకార్ రేసుపై హైకోర్టులో కేటీఆర్‌ తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్‌ను మెన్షన్ చేశారు. అయితే జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో మెన్షన్ చేశారు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లగా.. ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్‌ను కేటీఆర్ న్యాయవాదులు మెన్షన్ చేశారు. లంచ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించారు. దీంతో ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో విచారణ ఉండే అవకాశం ఉంది. లీగల్‌గా ఎదుర్కుంటాం: కేటీఆర్ఫార్ములా ఈరేస్‌ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నిలువదని.. ఇందులో అర పైసా కూడా అవినీతి లేదన్నారు. అయినా కేసు పెట్టి ముందుకే వెళితే లీగల్‌గా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌కు టీవోటీ విధానంలో టెండర్లు పిలిచామని.. దానికి అత్యుత్తమ బిడ్లు వచ్చాయన్నారు. దాని నుంచి వచ్చిన రూ.7400 కోట్లను రైతు రుణమాఫీకి వాడామన్నారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో టెండర్లు పిలిచింది వాస్తవమన్నారు. కుంభకోణం అయితే టెండర్ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ''ముందు టెండర్ రద్దు చేయి. సిట్టింగ్ జడ్జితో లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించు. కానీ నీ చేతిలో ఉండే సిట్‌తో విచారణ చేస్తే ఎలా న్యాయం జరుగుతుంది. కోకాపేట భూముల వేలం కూడా రద్దు చెయి'' అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై కేసు నమోదు.. ఫార్ములా ఈరేస్ కారు కేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ రేస్ కారుకు సంబంధించి నిధుల దుర్వినయోగం జరిగిదంటూ గుర్తించిన కాంగ్రెస్‌ సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి సీఎస్ లేఖ రాసింది. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ ఈకార్ రేస్‌కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవకతవకలు జరిగినట్లు నిర్ధారించింది. వెంటనే ఈ కార్ కేసుకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదుచేసింది. ఏ1గా అప్పటి మంత్రి కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేట్ కంపెనీ సీఈవోను చేర్చుతూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముందుకు వారికి నోటీసులు ఇచ్చిన అనంతరం ఏసీబీ విచారించే అవకాశం ఉంది. అయితే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కక్షతపూరితంగా కేసు నమోదు చేశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని ఇదే అంశం కుదిపేసింది. ఈరేస్‌పై చర్చ జరపాల్సిందే అని బీఆర్‌ఎస్ నేతలు పట్టుబట్టారు. కేటీఆర్ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సభలో చర్చకు బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు యత్నించారు. వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు బాటిల్స్, పేపర్స్ విసుకోవడంతో సభలో కాసేపు రణరంగంగా మారిపోయింది. దీంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. మరోవైపు ఈరేస్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని కమలం నేతలు చెబుతున్నారు. మొత్తానికి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa