సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో సోమవారం ప్రజల నుంచి విరాళాల సేకరణ సిపిఐ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిపిఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయడం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.