సంధ్య థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో సినీ పరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తుందని భాజపా ఎంపీ డీకే అరుణ అన్నారు.కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అభిమానులుగా వెళ్లిన కుటుంబంలో తల్లి రేవతి చనిపోవడం, కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమన్నారు. సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ముగింపు పలకాలని కోరారు.