తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న వార్డు సభలకు విశేష స్పందన లభిస్తోంది. గురువారం పట్టణంలోని 2వ వార్డుతో పాటు 8వ,11వ,14వ,18వ, 20వ,23వ వార్డులలో వార్డు సభలను నిర్వహించారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి తోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు తరలిరావడంతో వార్డు సభలు కళకళలాడాయి.
ఈ సభలలో ప్రత్యేక అధికారి డిఐఈఓ నారాయణ, మున్సిపల్ కమిషనర్ మోహన్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.