సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జేపీహెచ్బి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహకు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు మణయ్య, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa