గాంధీనగర్ డివిజన్ లోని వివేక్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మౌని అమావాస్య పురస్కరించుకొని చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ పాల్గొని అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa