చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. 'రామరాజ్యం' వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కొద్ది రోజుల క్రితం రంగరాజన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు.నేడు మంద కృష్ణ మాదిగ... రంగరాజన్‌ను కలిసిన సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్చకుడిపై దాడి దారుణమని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనలో రంగరాజన్‌కు న్యాయం జరిగే వరకు ఆయనకు తోడుగా ఉంటామని ఆయన తెలిపారు. రంగరాజన్‌ను కలిసిన వారిలో మంద కృష్ణ మాదిగతో పాటు మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa