తెలంగాణలో కుల గణనలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఇదివరకు చేసిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రేపటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు చేసే రీసర్వేలో పాల్గొనాలని ఇప్పటికే తెలిపింది. ఈ క్రమంలో మరో వెసులుబాటు కల్పించింది. కుల గణన సర్వే కోసం ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు వస్తారని తెలిపింది.కుల గణన కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-211-11111ను ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికి వెళ్లి వివరాలను నమోదు చేసుకుంటారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు కార్యాలయాలకు వెళ్లి కూడా వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa