ఉడకని చికెన్, అపరిశుభ్రత కారణంగా జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నెక్సెస్ మాల్‌లోని చైతన్య ఫుడ్ కోర్టు యజమానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సెప్టీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10న ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కంపెనీ ద్వారా చైతన్య ఫుడ్ కోర్టులో చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాడు. అయితే వచ్చిన ఆర్డర్ రుచి చూడగా.. చికెన్ సరిగా ఉడకలేదు. దీంతో వెంటనే ట్విట్టర్‌లో ఎక్స్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారులు ఫుడ్ కోర్టులో తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్రత ప్రదేశాల్లో వంటకాలు వండి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఫుడ్ కోర్టు యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడో రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇక బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ వంటకాలు తినేందుకు జంకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యల్లో కోళ్లు చనిపోతుండటంతో చికెన్ విక్రయాలపై ఆ ప్రభావం పడింది. కస్టమర్లు లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. పౌల్ట్రీ రైతులు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నారు. సరైన టెంపరేచర్‌లో చికెన్ ఉడికిస్తే.. ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నా.. ప్రజలు భయంతో చికెన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో హైదరాబాద్ ఉప్పల్‌లో వెంకోబ్ చికెన్ షాప్ వారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మేళ నిర్వహించారు. బర్డ్ ఫ్లూ రూమర్స్‌తో చికెన్ వినియోగంపై అవగాహన కోసం ఉప్పల్ చిలకనగర్‌లో ఈ ఉచిత చికెన్ మేళా నిర్వహించారు. ఇందులో దాదాపు 2500 కేజీల చికెన్ ఫ్రై, 2500 గుడ్లు ఉచితంగా పంచిపెచ్చారు. చికెన్ తినటం వల్ల ఎలాంటి రోగాలు రావని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి అపాయం జరగదని చెప్పారు. అన్ని బ్రాంచీల్లో ఉచితంగా వారం రోజుల పాటు పంపిణీ చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa