తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పందించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రాతినిధ్యం అంతంతమాత్రమేనని, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాదిన వచ్చింది 29 ఎంపీ స్థానాలేనని అన్నారు. దక్షిణాదిన ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారం లేదని, ఏపీలో కేవలం జూనియర్ భాగస్వామిగానే ఉందని తెలిపారు. అందుకే బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందని... అందుకు డీలిమిటేషన్ అంశాన్ని వాడుకుంటోందని వివరించారు. డీలిమిటేషన్ అమలు జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ధి చేకూరుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్రం ఆదేశాలతోనే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేశాయని అన్నారు. కేంద్రం మరో 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ను వాయిదా వేయాలని, అప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా ఏ రీతిలో పెరుగుతుందో చూడాలన్నారు.
![]() |
![]() |