హైదరాబాద్ సిటీ నడిఒడ్డున గల నెక్లెస్ రోడ్డులో ఏడాది కిందట ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింకలు దర్శనమిచ్చాయి.దీంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.విజయ్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి బిర్యానీ తినేందుకు ఆ హాటల్‌కు వెళ్లాడు.బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే,వాళ్లు తీసుకొచ్చిన బిర్యానీ సగం తిన్నతర్వాత అందులో బొద్దింక కనపడింది. ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. దీంతో విజయ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈ హోటల్ మీద చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa