రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, ల్యాబ్ ను పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు.
![]() |
![]() |