ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్‌లైన్‌ మోసాలని అరికట్టేందుకు ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ సాఫ్ట్‌వేర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 09:01 AM

డిజిటల్‌ యుగంలో భద్రతా పరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చెన్నైకి చెందిన ఒడిస్సీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ రెండు కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌ వేదికగా శుక్రవారం వీటిని విడుదల చేసింది. డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో ఈ ప్రొడక్ట్‌లు సరికొత్త విప్లవమని, వీటితో ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆ సంస్థ సీఎండీ రాబర్ట్‌ రాజా తెలిపారు. ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ పేర్లతో వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ‘డిజిటల్‌ అరెస్ట్‌’, స్కామ్‌లు, ఆన్‌లైన్‌ ఐడెంటిటీ థెప్ట్‌, ఎక్స్‌టార్షన్‌, రాన్సమ్‌వేర్‌ దాడులను ఈ సాఫ్ట్‌వేర్లతో అడ్డుకోవచ్చని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa