ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా ప్రజలతో శారీర‌క‌, ప్రేమ బంధాలు ఏర్పరుచుకోవద్దు అంటున్న అమెరికా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 11:54 AM

చైనా దేశపు మనుషులతో  ప్రేమ, పెళ్లి, శారీర‌క‌ సంబంధాలు ఏర్ప‌రుచుకోవ‌ద్ద‌ని అమెరికా, చైనాలోని త‌మ‌ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని హెచ్చ‌రించింది. చైనాలో అమెరికా మిషన్‌ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యుల‌కు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొల‌గిస్తామ‌ని తేల్చి చెప్పింది. కాగా, చైనాలో అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువ‌డ్డాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa