ఖమ్మం నగరంలోని 4వ డివిజన్ యూపీహెచ్ కాలనీలో స్వయం శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం స్వామివారికి చక్రస్నానం, వసంతోత్సవం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18 రకాల పుష్పాలతో, వేద మంత్రోచ్ఛారణ నడుమ మహా పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొల్లి కొమరయ్య ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa