తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. భూభారతి పోర్టల్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. శిల్పకళావేదికలో జరుగుతున్న ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. తొలుత 3 మండలాల్లో (సాగర్, తిరుమలగిరి, కీసర) ప్రయోగాత్మకంగా అమలుచేసి, జూన్-2 నాటికి పూర్తి స్థాయిలో విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa