నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్ లోని అంగన్వాడీ-1, 2 కేంద్రాల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పి. శోభ పాల్గొని మాట్లాడుతూ.. పోషణ పక్షంలో భాగంగా ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలని తెలిపారు.
గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, రక్తహీనతతో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదని అన్నారు. అనంతరం చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa