ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయహో పాకిస్థాన్ అని నోరుజారిన బీజేపీ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 02:45 PM

పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు కూడా పాకిస్థాన్‌ను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. 
అయితే, నిరసన సందర్భంగా ఓ బీజేపీ నాయకుడు ‘భారత్ మాతాకీ జై.. జయహో జయహో పాకిస్థాన్’ అంటూ పొరపాటున నినాదం చేశారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు గుర్తించి అతడిని హెచ్చరించడంతో, ఆ నాయకుడు తన పొరపాటు తెలుసుకొని ‘జయహో భారత్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa