కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శిబిరంలో పశువులకు నట్ట, పేను నివారణ మందులతో పాటు ఇతర పోషక మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
అలాగే రైతులకు పాడిపశుnవుల సంరక్షణ, పోషణ విషయాలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి శిబిరాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని, పశువుల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa