ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం బషీర్ బాగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి చాంపియన్‌గా నిలుస్తుందని అన్నారు. "ఏఐసీసీ అధ్యక్షుడిగా ఓ నిరుపేద దళితుడిని ఎన్నుకున్నది కాంగ్రెస్‌నే" అని గుర్తు చేశారు. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తామని, తెలంగాణ సీఎంకి కూడా సూచిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa