అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో ఈ నెల 3వ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును మేడ్చల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కరుడుగట్టిన నేరస్థుడు చింతకింది అనిల్ (36)ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
అనిల్ గతంలో డబ్బుల కోసం రేప్, హత్యలతో సహా పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డీసీపీ కార్యాలయంలో బుధవారం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa