బీబీపేట్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, రైతుల కళ్ళలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల పునర్నిర్మాణం కోసం 23 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa