ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొని పునాదిరాళ్లు వేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ కళాశాల ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు స్థానికులకు ఆరోగ్యసేవలు అందించడంలో ఈ కళాశాల కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa