మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న అంధుల పాఠశాల మరియు కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాములు గారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆయన వివరిస్తూ, ఈ విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. నారాయణపేట జిల్లాకు చెందిన అంధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే వారు కనీసం 40 శాతం అంధత్వం కలిగిన వారు కావాలి.
వివరాలకు మరియు అడ్మిషన్ సంబంధిత వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 9618243794 నంబరుకు సంప్రదించవచ్చు అని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa