భారత్-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ నివాసితులకు ఎప్పటికప్పుడు సహాయం, సమాచారం, అవసరమైన సేవలు అందించడమే ఈ కంట్రోల్ రూమ్ ముఖ్య ఉద్దేశం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తుంది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఈ కంట్రోల్ రూమ్ సంప్రదింపు నెంబర్లను విడుదల చేసింది. సహాయం కోసం ల్యాండ్‌లైన్ నెంబర్: 011-23380556, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ వందన మొబైల్ నెంబర్: 9871999044, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు హైదర్ అలీ నఖ్వీ మొబైల్ నెంబర్: 9971387500, లైజన్ ఆఫీసర్ జి. రక్షిత్ నాయక్ మొబైల్ నెంబర్: 9643723157, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్. చక్రవర్తి మొబైల్ నెంబర్: 9949351270 లను సంప్రదించవచ్చునని సూచించారు.
ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఏపీ భవన్‌లోని కంట్రోల్ రూమ్ సంప్రదింపు నెంబర్లు: 011-23387089, 98719 99430, 98719 99053 ఇచ్చింది. అదనపు సమాచారం ,సహాయం కోసం డిప్యూటీ కమిషనర్ మొబైల్ నెంబర్: 98719 90081, లైజన్ ఆఫీసర్ మొబైల్ నెంబర్: 9818395787 కూడా అందుబాటులో ఉంచారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల భద్రత, అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ చర్యలు తీసుకున్నాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు సమర్థవంతంగా చేపట్టేందుకు వీలుగా సివిల్ డిఫెన్స్ చట్టంలోని అత్యవసర అధికారాలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇక ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో భద్రత, పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa