భారత్, పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయాన్ని ప్రతిపాదించారు. దేశ రక్షణలో నిమగ్నమైన భారత సైన్యానికి సంఘీభావం తెలిపే దిశగా ఆయన ఈ చొరవ తీసుకున్నారు.పాకిస్థాన్ దుందుడుకు చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న భారత సైనిక దళాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో, రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి విరాళంగా అందించాలని ఆయన సూచించారు.ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చలు జరిపి, ఆ పార్టీ తరఫున విరాళంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అంతేకాకుండా, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa