అప్పుల బాధతో రాష్ట్రంలో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య . పెద్దపల్లి జిల్లా గుర్రాంపల్లి గ్రామానికి చెందిన అటుకుల రవీందర్ రెడ్డి (45) అనే రైతు, 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగు చేసిన పంట నష్టపోవడంతో, అప్పులు తీర్చలేనని బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రవీందర్ రెడ్డి . పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన ఏలేటి ముత్యం రెడ్డి (63) అనే రైతు అప్పుల బాధతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa