తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు.మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ అభినందించారు. ''కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 'కమీషన్ సర్కార్' గా మారిపోయింది. ఇది ఓపెన్ సీక్రెట్'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.తన ట్వీట్‌లో, ''ప్రస్తుతం ప్రభుత్వం లో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కారణంగా సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘటనను గుర్తుంచుకోండి'' అని వ్యాఖ్యానించారు.కేటీఆర్ మరింతగా స్పందిస్తూ - ''కొండా సురేఖను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాలు ప్రజల ముందుకు తీసుకురావాలి. అలాగే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు దీనిపై దర్యాప్తుకు ఆదేశించగలరా?'' అని ప్రశ్నించారు.ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
![]() |
![]() |