నగరంలోని ప్రసిద్ధ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ముదిగొండ మురళి, ఆలయ వంశీయులు, ఆలయ ఈవో అన్నపూర్ణ, సిబ్బంది, పండితులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు.
![]() |
![]() |