ఫ్యూచర్‌సిటీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్‌సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. అక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదని, గ్రేటర్ పరిధిలో స్మార్ట్‌పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఓఆర్‌ఆర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా (హబ్‌గా) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. డేటా సెంటర్లకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్ల ఆధునికీకరణ, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్యూచర్‌సిటీ నిర్మాణం ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని, అందులో భాగంగానే భూగర్భ విద్యుత్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ప్రయోగాత్మకంగా స్మార్ట్‌పోల్స్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
![]() |
![]() |