హైదరాబాద్ భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో 'డేటా సిటీ' ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సీఎం వెల్లడించారు.
విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చర్యలు హైదరాబాద్‌ను అత్యాధునిక సాంకేతిక నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ రూపొందడం ద్వారా సాంకేతికత, ఉపాధి, ఆర్థిక వృద్ధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
![]() |
![]() |