ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఈ నగరంలో విద్యుత్ లైన్లను పూర్తిగా భూగర్భంలో ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. ఫ్యూచర్‌సిటీలో విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకుండా ఆధునిక వ్యవస్థను అమలు చేయాలని సూచించారు.
అంతేకాక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవి సౌందర్యాత్మకంగానూ, సాంకేతికంగానూ అధునాతనంగా ఉంటాయి. అదనంగా, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వెంబడి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యుత్ శాఖకు సీఎం సూచనలు జారీ చేశారు.
ఈ నిర్ణయాలతో ఫ్యూచర్‌సిటీ స్మార్ట్, సుస్థిర నగరంగా అభివృద్ధి చెందే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లు అధికారులు తెలిపారు.
![]() |
![]() |